BREAKING
సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని కలిసి వినతి పత్రం సమర్పించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా ఆకుల కల్పన చంద్రశేఖర్ కార్తీక దీపకాంతులతో వెలిగిన నవనాథ సిద్ధులగుట్ట - తెల్లవారుజాము నుంచే  పోటెత్తిన భక్తులు ణేష్ ఘాట్‌లో మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన విరాళాల సేకరణ దాతను సన్మానించిన హిందూ జాగృతి సభ్యులు ఏఐతో వీఎల్‌ఎస్‌ఐ, సీఎంఓఎస్‌ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విజేతలకు బహుమతులు పంపిణీ ఆలూరులో ప్రీ ప్రైమరీ తరగతి గది ప్రారంభం జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ఉప్లూర్ లో కల్యాణ లక్ష్మి  చెక్కు పంపిణి పట్టణాభివృద్ధిలో నూతన పాలకవర్గం భాగస్వాములు కావాలి ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు

హెబ్బటం గ్రామ సర్పంచ్ కు ఘన సత్కారం

Select Suryaa Now
హెబ్బటం గ్రామ సర్పంచ్ కు ఘన సత్కారం

హెబ్బటం గ్రామ సర్పంచ్ కు ఘన సత్కారం

హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బోయ గుబ్బల్ని సవారమ్మను సోమవారం టిడిపి నాయకులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా  గ్రామ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవంగా నిర్ణయించుకోవడం అభినందనీయంమని నాయకులు అన్నారు.
తెలుగు యువత రాష్ట్ర మాజీ కార్యదర్శి చిన్నహ్యాట శేషగిరి ఆత్మీయంగా కలిసి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.
గ్రామ ప్రజలు చూపిన ఈ అభిమానం, ఆప్యాయత, గౌరవం ఎంతో సంతోషాన్ని కలిగించాయి.గ్రామ అభివృద్ధి,ప్రజల ఐక్యత, పరస్పర సహకారం లక్ష్యంగా అందరూ కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలవాలి.
రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరూ ఒకే మాటపై నిలబడి, ఐకమత్యంతో ముందుకు సాగడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ తిప్పయ్య, నాయకులు మురళీధర్,గుబ్బలి లక్ష్మయ్య,పక్కీరప్ప,సాయి బేస్, శంకరప్ప, పాల్గొన్నారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.