BREAKING
సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని కలిసి వినతి పత్రం సమర్పించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా ఆకుల కల్పన చంద్రశేఖర్ కార్తీక దీపకాంతులతో వెలిగిన నవనాథ సిద్ధులగుట్ట - తెల్లవారుజాము నుంచే  పోటెత్తిన భక్తులు ణేష్ ఘాట్‌లో మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన విరాళాల సేకరణ దాతను సన్మానించిన హిందూ జాగృతి సభ్యులు ఏఐతో వీఎల్‌ఎస్‌ఐ, సీఎంఓఎస్‌ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విజేతలకు బహుమతులు పంపిణీ ఆలూరులో ప్రీ ప్రైమరీ తరగతి గది ప్రారంభం జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ఉప్లూర్ లో కల్యాణ లక్ష్మి  చెక్కు పంపిణి పట్టణాభివృద్ధిలో నూతన పాలకవర్గం భాగస్వాములు కావాలి ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు

కళ్యాణదుర్గం లో వైసీపీ నుంచి టిడిపిలోనికి కొనసాగుతున్న వలసలు.

Select Suryaa Now
కళ్యాణదుర్గం  లో వైసీపీ నుంచి టిడిపిలోనికి కొనసాగుతున్న వలసలు.

కళ్యాణదుర్గం: నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. నియోజకవర్గంలో కూటమి పార్టీలు బలోపేతం దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో వివిధ గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కళ్యాణదుర్గం మండల పరిధిలోని హులికల్లు, మల్లికార్జునపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. హులికల్లు గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకుడు ఉల్లంగుల శ్రీనివాసులు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య యువ నాయకుడు తిప్పేష స్థానిక నాయకుల ఆధ్వర్యంలో యువ నాయకుడు దేవినేని అవినాష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కూడా పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. రెండు గ్రామాలకు చెందిన నాయకుల చేరికలతో ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరింత మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో జరుగుతున్న ఈ వరుస చేరికలు స్థానిక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :-  బోయ రంగస్వామి.