BREAKING
ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విజేతలకు బహుమతులు పంపిణీ ఆలూరులో ప్రీ ప్రైమరీ తరగతి గది ప్రారంభం జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ఉప్లూర్ లో కల్యాణ లక్ష్మి  చెక్కు పంపిణి పట్టణాభివృద్ధిలో నూతన పాలకవర్గం భాగస్వాములు కావాలి ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ఇజ్రాయిల్ కుటుంబానికి ఆర్థిక చేయూత........ ఎంపీపీ చండ్రా మధుసూదన్ రావు సూచనలతో ఆర్థిక సహాయం అందించిన నాయకులు....... సీతారామ భద్ర క్షేత్ర ప్రారంభానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలి అర్హులందరికీ బీమా రక్షణ కల్పించడమే లక్ష్యం ...ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు హెబ్బటం గ్రామ సర్పంచ్ కు ఘన సత్కారం నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వరం లాంటిది రైల్వే బ్రిడ్జిపై నుంచి పడి వ్యక్తి మృతి అటు భారత్, ఇటు పాక్.. సైనికుల త్యాగాల నేపథ్యంతో ఆకట్టుకుంటున్న ‘ది ఇండియన్ బార్డర్’ పోస్టర్

పేద కుటుంబానికి రాజకీయ అవకాశం.. గొరవనహళ్లి అభివృద్ధే లక్ష్యంగా చందన్ రాం ఎన్నికల బరిలో!

Select Suryaa Now
పేద కుటుంబానికి రాజకీయ అవకాశం.. గొరవనహళ్లి అభివృద్ధే లక్ష్యంగా చందన్ రాం ఎన్నికల బరిలో!

రాజకీయాల్లో అవకాశాలు పదవుల కోసం కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత కోసం ఉండాలనే సంకల్పంతో మోద పంచాయతీ గొరవనహళ్లి గ్రామానికి చెందిన దాసరి చందన్ రాం ఎన్నికల బరిలో నిలిచారు. కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ స్థానానికి కొడిగెనహళ్లిలో నామినేషన్ దాఖలు చేశారు.బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ అధ్యక్షతన, పార్టీ నాయకత్వం నిరుపేద కుటుంబానికి రాజకీయంగా అవకాశం కల్పించడంతో చందన్ రాం ప్రత్యేక గుర్తింపు పొందారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు పార్టీ ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజాసేవకు వేదికగా మలుచుకుంటానని ఆయన తెలిపారు.గ్రామ అభివృద్ధే నా ప్రథమ లక్ష్యం.. మోద పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు గొరవనహళ్లి గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల ఆదరణతో గ్రామ అభివృద్ధికి అంకితమవుతానని చందన్ రాం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాపు సీట్ల సంజీవరాయప్ప అశ్వాత్తప్ప మల్లికార్జున  పరిటాలశివ బేబీ వెంకటేష్ లవన్ అదేప్ప అశ్వాత్తప్ప రామాంజి  గంగాధరప్ప శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.