ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు
పల్నాడు జిల్లా : జిల్లాలోని 12 మండలాల్లో పంచాయతీ ఎన్నికల మూడో విడతకు సంబంధించి చివరి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. చిలకలూరిపేట, గురజాల, మాచర్ల నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో బారికేడ్లు ఏర్పాటు చేసి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే కేంద్రంలోకి అనుమతి ఇస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.
మల్లికార్జున రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి…