BREAKING
ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విజేతలకు బహుమతులు పంపిణీ ఆలూరులో ప్రీ ప్రైమరీ తరగతి గది ప్రారంభం జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ఉప్లూర్ లో కల్యాణ లక్ష్మి  చెక్కు పంపిణి పట్టణాభివృద్ధిలో నూతన పాలకవర్గం భాగస్వాములు కావాలి ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ఇజ్రాయిల్ కుటుంబానికి ఆర్థిక చేయూత........ ఎంపీపీ చండ్రా మధుసూదన్ రావు సూచనలతో ఆర్థిక సహాయం అందించిన నాయకులు....... సీతారామ భద్ర క్షేత్ర ప్రారంభానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలి అర్హులందరికీ బీమా రక్షణ కల్పించడమే లక్ష్యం ...ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు హెబ్బటం గ్రామ సర్పంచ్ కు ఘన సత్కారం నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వరం లాంటిది రైల్వే బ్రిడ్జిపై నుంచి పడి వ్యక్తి మృతి అటు భారత్, ఇటు పాక్.. సైనికుల త్యాగాల నేపథ్యంతో ఆకట్టుకుంటున్న ‘ది ఇండియన్ బార్డర్’ పోస్టర్

మేయర్‌గా పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం *ఏకగ్రీవంగా ఎన్నికైన డిప్యూటీ మేయర్‌ కూరపాటి రఘునాథరాజు

Select Suryaa Now
మేయర్‌గా పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం  *ఏకగ్రీవంగా ఎన్నికైన  డిప్యూటీ మేయర్‌ కూరపాటి రఘునాథరాజు

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్

నెల్లూరు నగర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, నగర సమగ్ర అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు.
సోమవారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి సమక్షంలో నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 
ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ముందుగా నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌గా ఎన్నికైన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్‌తో జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 72 మంది నూతన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి సమక్షంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను కలెక్టర్ నిర్వహించారు. 60వ డివిజన్ కార్పొరేటర్ కూరపాటి రఘునాథరాజు పేరును 46వ డివిజన్ కార్పొరేటర్ షంషుద్ధిన్ ప్రతిపాదించగా, 45వ డివిజన్ కార్పొరేటర్ సుందర రామిరెడ్డి బలపరిచారు. కార్పొరేటర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో కూరపాటి రఘునాథరాజు నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు.


ప్రజల ఆశలు, ఆకాంక్షలను అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలి

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాజీవితంలోకి ప్రవేశించడం ఎంతో ముఖ్యమైన సందర్భమని, అదే సమయంలో ప్రజాప్రతినిధుల బాధ్యతలు కూడా గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత జీవితం, ప్రవర్తన, మాటతీరు, భాష వంటి ప్రతి అంశాన్ని ప్రజలు, మీడియా నిశితంగా గమనిస్తుంటారని తెలిపారు. కాబట్టి తమ బాధ్యతలను గుర్తించి హుందాతనంతో వ్యవహరించాలని సూచించారు. 
స్థానిక ప్రజల రోజువారీ సమస్యల పరిష్కారంలో మున్సిపల్ కార్పొరేటర్ల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు. రహదారులు, తాగునీరు, దోమల నివారణ, ఆరోగ్యం, పింఛన్లు, ప్రభుత్వ పాఠశాలలు తదితర మౌలిక సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి కార్పొరేటర్ తమ డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కనీసం ఒక గంట పాటు కార్యాలయంలో లేదా నివాసంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. తమ ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు, తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు కూడా తప్పనిసరిగా స్పందించాలని కోరారు.
నగర ప్రజల అంచనాలు, అవసరాలు ఎక్కువగా ఉన్నప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద అందుబాటులో ఉన్న వనరులు పరిమితంగా ఉంటాయని కలెక్టర్ వివరించారు. అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూనే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సత్సంబంధాలు, సమన్వయం కలిగి ఉండాలని సూచించారు. వారి సహకారంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు సీఎస్ఆర్  నిధులను సమీకరించి డివిజన్ల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాబోయే ఐదేళ్ల పదవీకాలంలో నూతన పాలకమండలి సభ్యులందరూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, నగర అభివృద్ధిలో క్రియాశీలక భాగస్వాములై విజయవంతంగా పదవీకాలాన్ని పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైఓ నందన్, నగరపాలక సంస్థ  ఎస్ఈ రహమత్ జాని, కౌన్సిల్ కార్యదర్శి శ్రీలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు పాటు స్థానిక నాయకులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావడంతో కౌన్సిల్ హల్ కిక్కిరిసిపోయింది  పాల్గొన్నారు.