BREAKING
ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విజేతలకు బహుమతులు పంపిణీ ఆలూరులో ప్రీ ప్రైమరీ తరగతి గది ప్రారంభం జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ఉప్లూర్ లో కల్యాణ లక్ష్మి  చెక్కు పంపిణి పట్టణాభివృద్ధిలో నూతన పాలకవర్గం భాగస్వాములు కావాలి ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ఇజ్రాయిల్ కుటుంబానికి ఆర్థిక చేయూత........ ఎంపీపీ చండ్రా మధుసూదన్ రావు సూచనలతో ఆర్థిక సహాయం అందించిన నాయకులు....... సీతారామ భద్ర క్షేత్ర ప్రారంభానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలి అర్హులందరికీ బీమా రక్షణ కల్పించడమే లక్ష్యం ...ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు హెబ్బటం గ్రామ సర్పంచ్ కు ఘన సత్కారం నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వరం లాంటిది రైల్వే బ్రిడ్జిపై నుంచి పడి వ్యక్తి మృతి అటు భారత్, ఇటు పాక్.. సైనికుల త్యాగాల నేపథ్యంతో ఆకట్టుకుంటున్న ‘ది ఇండియన్ బార్డర్’ పోస్టర్

పోలీసుల అండతోనే టీడీపీ గెలుపు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

Select Suryaa Now
పోలీసుల అండతోనే టీడీపీ గెలుపు  మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

పల్నాడు జిల్లా : వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రజాబలంతో కాకుండా పోలీసుల అండతో, దొంగ ఓట్ల ద్వారా విజయం సాధించారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నాయకుడు బొల్లా బ్రహ్మ నాయుడు ఆరోపించారు. అధికార బలంతో పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గెలిచినంత మాత్రాన అది నిజమైన గెలుపు కాదని వ్యాఖ్యానించారు. వినుకొండ మున్సిపాలి టీలో గెలుపొందిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున తొమ్మిది మంది కౌన్సిలర్లు ప్రజల మద్దతుతో విజయం సాధించారని తెలిపారు. జీవీ ఆంజనేయులు ఈ విజయాన్ని తన బలంగా చెప్పుకోవడం సరికాదన్నారు. వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి పీఎస్ ఖాన్ 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడానికి పోలీసుల వ్యవహారశైలే కారణమని ఆరోపించారు. సీఐ ప్రభాకర్‌రావు రౌడీషీటర్లకు అండగా నిలిచారని విమర్శించారు. అర్చనా మూర్తితోపాటు ఐదో వార్డు కౌన్సిలర్‌పై దాడి చేసి బయటకు పంపించారని, రెడ్డినగర్‌తో పాటు 7, 18, 19, 20వ వార్డుల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. తనను గృహ నిర్బంధం చేయకుండా నరసరావుపేటకు తరలించారని చైర్‌పర్సన్ అభ్యర్థి పీఎస్ ఖాన్, న్యాయవాది ఎం.ఎన్. ప్రసాద్‌లను సైతం నిర్బంధించారని ఆరోపించారు. పార్టీ ముఖ్య నాయకులను పోలీస్ స్టేషన్లకు తరలించి రౌడీషీటర్లతో పాటు ముసుగులు ధరించిన వ్యక్తుల ద్వారా దొంగ ఓట్లు వేయించారని విమర్శించారు. మృతులు స్థానికంగా నివసించని వారి ఓట్లను కూడా వినియోగించుకున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలు లేకపోతే తమ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచేవారని అన్నారు. ఎన్నికల్లో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదులు అందజేశామని, వాటిపై సమగ్ర విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను పోలీసులు బెదిరిస్తూ గంజాయి, మత్తు పదార్థాలు, హత్యాయత్నం కేసులు పెడతామంటూ భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.
ప్రజా మద్దతుతో విజయం సాధించిన తొమ్మిది మంది కౌన్సిలర్లకు బొల్లా బ్రహ్మనాయుడు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో అక్రమాల కారణంగా ఓటమి పాలయ్యామని భావిస్తున్న అభ్యర్థులు నిరుత్సాహపడవద్దని, పార్టీ పరంగా వారందరికీ సముచిత గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. వచ్చే ఐదేళ్ల తర్వాత తాను ఎమ్మెల్యేగా గెలిచి, వారందరినీ చట్టబద్ధంగా కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేయిస్తానని, అలా చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. భవిష్యత్తులో పీఎస్ ఖాన్‌కు మరోసారి చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించడంతోపాటు మరింత ఉన్నత పదవి కల్పిస్తామని తెలిపారు.

మల్లికార్జున రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..