BREAKING
ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విజేతలకు బహుమతులు పంపిణీ ఆలూరులో ప్రీ ప్రైమరీ తరగతి గది ప్రారంభం జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ఉప్లూర్ లో కల్యాణ లక్ష్మి  చెక్కు పంపిణి పట్టణాభివృద్ధిలో నూతన పాలకవర్గం భాగస్వాములు కావాలి ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ఇజ్రాయిల్ కుటుంబానికి ఆర్థిక చేయూత........ ఎంపీపీ చండ్రా మధుసూదన్ రావు సూచనలతో ఆర్థిక సహాయం అందించిన నాయకులు....... సీతారామ భద్ర క్షేత్ర ప్రారంభానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలి అర్హులందరికీ బీమా రక్షణ కల్పించడమే లక్ష్యం ...ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు హెబ్బటం గ్రామ సర్పంచ్ కు ఘన సత్కారం నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వరం లాంటిది రైల్వే బ్రిడ్జిపై నుంచి పడి వ్యక్తి మృతి అటు భారత్, ఇటు పాక్.. సైనికుల త్యాగాల నేపథ్యంతో ఆకట్టుకుంటున్న ‘ది ఇండియన్ బార్డర్’ పోస్టర్

కార్మికుల హక్కుల కోసం పెన్నారు కంపెనీ ఎదుట ధర్నా

Select Suryaa Now
కార్మికుల హక్కుల కోసం పెన్నారు కంపెనీ ఎదుట ధర్నా

మోమిన్‌పేట్,మేజర్ న్యూస్: కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి, అర్హులైన ప్రతి కార్మికుడికి శాశ్వత ఉద్యోగం కల్పించడంతో పాటు నెలకు రూ.30 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బోవోల్లా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం పెన్నారు కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండల పరిధిలోని వెల్చాల్, మొరంగపల్లి ప్రాంతంలోని కంపెనీ వద్ద చేపట్టిన ఈ ఆందోళనలో కార్మికుల హక్కుల సాధన కోసం నాయకులు గళమెత్తారు. ఈ సందర్భంగా బోవోల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, ప్రతినెలా నిర్ణీత సమయానికి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సకాలంలో బోనస్ అందించడంతో పాటు ప్రతి సంవత్సరం వార్షిక వేతన పెంపు అమలు చేయాలని కోరారు. కార్మికుల శ్రమను గుర్తించి వారి న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని, సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ ధర్నాకు గ్రామ, మండల స్థాయి నాయకులు సంఘీభావం ప్రకటించారు. వెల్చాల్ సర్పంచ్ శ్రీనివాస్, మొరంగపల్లి సర్పంచ్ అరుణ బిచ్చయ్య, రైతు నాయకుడు పి. రఘురాం రెడ్డి, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కట్టెల మల్లేశం, బీజేపీ మండల అధ్యక్షుడు ఆశిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్. శ్రీశైలం తదితరులు పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు.