BREAKING
ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విజేతలకు బహుమతులు పంపిణీ ఆలూరులో ప్రీ ప్రైమరీ తరగతి గది ప్రారంభం జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ఉప్లూర్ లో కల్యాణ లక్ష్మి  చెక్కు పంపిణి పట్టణాభివృద్ధిలో నూతన పాలకవర్గం భాగస్వాములు కావాలి ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ఇజ్రాయిల్ కుటుంబానికి ఆర్థిక చేయూత........ ఎంపీపీ చండ్రా మధుసూదన్ రావు సూచనలతో ఆర్థిక సహాయం అందించిన నాయకులు....... సీతారామ భద్ర క్షేత్ర ప్రారంభానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలి అర్హులందరికీ బీమా రక్షణ కల్పించడమే లక్ష్యం ...ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు హెబ్బటం గ్రామ సర్పంచ్ కు ఘన సత్కారం నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వరం లాంటిది రైల్వే బ్రిడ్జిపై నుంచి పడి వ్యక్తి మృతి అటు భారత్, ఇటు పాక్.. సైనికుల త్యాగాల నేపథ్యంతో ఆకట్టుకుంటున్న ‘ది ఇండియన్ బార్డర్’ పోస్టర్

నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో వైద్య సదుపాయాల పరిశీలన

Select Suryaa Now
నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో వైద్య సదుపాయాల పరిశీలన

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఏపీఏపీఎంసీఈ చట్టం–2002 నిబంధనలు, ఐసీయూ పడకల నిర్వహణ మార్గదర్శకాల అమలు తీరును పరిశీలించే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఖాదర్ వలీ ఈరోజు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆసుపత్రిలోని ఐసీయూ విభాగాలు, అందుబాటులో ఉన్న పడకల సంఖ్య, ఆధునిక వైద్య పరికరాలు, అత్యవసర వైద్య సేవలు మరియు మౌలిక వసతులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలతో పాటు, ఆసుపత్రిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందుబాటు మరియు సేవల నిర్వహణ తీరును సమీక్షించారు.
అనంతరం ఆసుపత్రిలోని వివిధ వైద్య విభాగాల అధిపతులతో  డాక్టర్ ఖాదర్ వలీ ప్రత్యేకంగా సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. ఆయా విభాగాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఆధునిక వైద్య పరికరాలు, రోగులకు అందిస్తున్న చికిత్స, వైద్య సిబ్బంది వివరాలు, అదనంగా అవసరమైన మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలపై విభాగాధిపతులతో చర్చించి వివిధ విభాగాల్లో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించిన అనంతరం డాక్టర్ ఖాదర్ వలీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీ సందర్భంగా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్. ప్రభావతి, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లి, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. అరుణ్ కాంత్ మరియు సంబంధిత వైద్య అధికారులు ఆసుపత్రి సదుపాయాలకు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు.