కళ్యాణదుర్గాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం..
# కళ్యాణదుర్గాన్ని ఆదర
**కళ్యాణదుర్గం:** పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్‌పర్సన్ బుట్నా లక్ష్మి పేర్కొన్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నాయకత్వంలో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకంతో చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంతో తెలిపారు. తనను గెలిపించి, ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారికి నిరంతరం సేవలందించడమే తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. పట్టణ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేకుండా అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని వెల్లడించారు. వార్డుల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ, వీధిలైట్లు తదితర మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పట్టణ అభివృద్ధికి చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి తన పూర్తి సహకారం ఉంటుందని, ఆయన ఆలోచనలు, ప్రణాళికలకు అనుగుణంగా మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం, అధికారుల సహకారం, ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ముందుగా తమ వార్డు కౌన్సిలర్లను సంప్రదించాలని సూచించారు. కౌన్సిలర్లు సమస్యల పరిష్కారానికి స్పందించని పక్షంలో నేరుగా మున్సిపల్ కార్యాలయంలోని తన కార్యాలయానికి వచ్చి సమస్యలను తెలియజేయవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల కోసం తన కార్యాలయ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ప్రతి సమస్యను బాధ్యతగా స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పదవి అనేది హోదా కోసం కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజల సహకారంతో కళ్యాణదుర్గం పట్టణాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తానని చైర్‌పర్సన్ బుట్నా లక్ష్మి స్పష్టం చేశారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.