BREAKING
మైనర్ వేధింపుల కేసులో వయోలిన్ విద్వాంసుడు అరెస్ట్: బాధితులు ధైర్యంగా ముందుకు రావాలన్న సింగర్ చిన్మయి మంచు విష్ణు బర్త్‌డే స్పెషల్: ప్రభుదేవా దర్శకత్వంలో పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'వీఎం 24' ప్రకటన 66 పరుగులకే ఆలౌట్ చేసి ఘనవిజయం సాధించినా నిరాశే: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ నుంచి అఫ్గనిస్థాన్ అవుట్ నెల రోజుల్లో ఎన్కతలకు రూ.2 కోట్ల నిధులు తీసుకొస్తా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వృద్ధురాలికి వీల్ చైర్ అందజేత..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు కృతజ్ఞతలు తెలియజేసిన వృద్ధురాలు మైదానంలో సహచరులపై అసహనం సరికాదు: శుభ్‌మన్ గిల్ తీరుపై అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు వెల్లింగ్టన్ టెస్టులో మిచెల్, ఫిలిప్స్ అద్భుత పోరాటం: భారత్‌పై అరుదైన రికార్డు నమోదు సిరాజ్, జడేజా ఉన్నా ఫలితం మారేది కాదు: తొలి టెస్టు డ్రాపై శుభ్‌మన్ గిల్ స్పష్టత బేసిన్ రిజర్వ్‌లో అరుదైన డ్రా: 2015 తర్వాత 15 టెస్టుల్లో రెండోసారి మాత్రమే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లపై నవజోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు: క్రీడలపైనే దృష్టి పెట్టాలని పిలుపు ఆళ్లగడ్డ మున్సిపాలిలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి . ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోడిచెర్లలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్‌కు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ నిజమైన స్పిన్నర్ ఎక్కడ? కుల్దీప్, మానవ్ సుతార్‌లపై సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు

ఆళ్లగడ్డ మున్సిపాలిలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి . ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

Select Suryaa Now
ఆళ్లగడ్డ మున్సిపాలిలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి . ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ ;ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున సోమవారం కౌన్సిలర్లు అరుణ వార్డు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడించారు. ఆమె సోమవారం టిడిపి సీనియర్ నాయకులు భార్గవ్ రామ్ నాయుడు, టిడిపి యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత రెడ్డి లతో కలిసి ఆళ్లగడ్డ మున్సిపాలిటీ నూతన పాలకవర్గమైన చైర్మన్ షేక్ అనీషా, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ప్రస్తుతం మున్సిపాలిటీలో బ్రిటిష్ కాలం నాటి భవనంలో సమావేశంలో సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు.భవనం లేక సమావేశాలు జరుపుకోవడానికి ఇబ్బందిగా మారిందని రూ.3 కోట్లతో అన్ని అంగులతో భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఆల్రెడీ మున్సిపాలిటీకి మంజూరైన రూ.21 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. ఆళ్లగడ్డలో ఐదు కోట్లతోతో డిగ్రీ కళాశాలతో పాటు రెండు పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ఆమె వివరించారు.గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అడ్డుకున్నారని ఆరోపించారు. అభ్యర్థులను కిడ్నాప్ చేసి ఇబ్బందులు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి మాటల మనిషి కాదు చేతుల మనిషి అని అన్నారు. ప్రజల ఆశీర్వాదం మన బలం వల్లనే అధికంగా ఏకగ్రీవాలు అయ్యాయని తెలిపారు. కూటమి నాయకులు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గుర్తించారన్నారు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ఆళ్లగడ్డ మున్సిపాలిలో అవసరమైన పనులు చేపట్టి అభివృద్ధికి పెద్ద పీట వేస్తామన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు విడిగా కాకుండా అందరూ కలిసి ఒకేసారి ప్రమాణస్వీకారం చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేడు విడిగా ప్రమాణ స్వీకారం చేసిన సమావేశంలో కలిసి పనిచేయవలసి ఉంటుందని ఆమె అన్నారు. మూడుసార్లు వరుసగా సమావేశాలకు రాకపోతే పదవికి అనర్హులవుతారు అన్నారు ప్రతి ఒక్కరూ మున్సిపల్ సమావేశాలకు కచ్చితంగా హాజరు కావాలని ఆమె సూచించారు. భూమా, కాటసాని, సోముల, చింతకుంట  వర్గాల వారికి మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం కల్పించామన్నారు. పార్టీ నుంచి ఇతర పార్టీలో ఉన్న వారిని తిరిగి పార్టీలో చేరితే ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు.  ఈ కార్యక్రమంలో న్యాయవాది శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, కూటమికౌన్సిలర్లు, పలువు తెలుగుదేశం నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా