BREAKING
'భోగి'లో నా పాత్రతో ఆకట్టుకుంటా: డింపుల్ హయాతి ఆర్‌పీల సమస్యలు పరిష్కరించాలి నార్నూర్ లో వైభవంగా కాకడ హారతి 5 లక్షలు విలువైన నగదు బహుమతులు గల బ్రోచర్లను విడుదల చేసిన ఎమ్మెల్యే. దిందా గ్రామంలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభం వైసీపీ సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి వైభవంగా పలమనేరు పురపాలక సంఘ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అమర్, సినీ నటుడు సుమన్ హాజరు చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి, వైస్ చైర్మన్‌గా జనసేనకు చెందిన మురాద్ ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంను సద్వినియోగం చేసుకోవాలి:గొట్టిముక్కల సర్పంచ్ సుద్దగళ్ల సంగీతా లింగమయ్య సారస్వత నికేతనాన్ని సందర్శించిన పరకాల ప్రభాకర్** ఇందిరమ్మ భీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి -జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డా. రాథోడ్ జైసింగ్ రేపు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడిః ఎంపీ, ఆర్. కృష్ణయ్య పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అండ. చెత్తకుప్పల్లో బ్యాలెట్లు.. ఎన్నికల వ్యవస్థకే సిగ్గుచేటు మిట్టపాలెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య

వైసీపీ సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి

Select Suryaa Now
వైసీపీ సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి

వేంపల్లె మేజర్ న్యూస్:
ఈనెల 29న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి షేక్ షబ్బీర్ వలి విజయానికి సమిష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ మండల కన్వీనర్ కె.చంద్రఓబుల్ రెడ్డి, మాజీ జడ్పీటిసి సభ్యుడు ఎం.రవికుమార్ రెడ్డి లు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నాయకులు, కార్యకర్తలతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జడ్పీటీసీ ఎన్నికల్లో సాధించిన విజయంతో వచ్చిన ఉత్సాహాన్ని సర్పంచి ఎన్నికల్లోనూ కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వేంపల్లి సర్పంచి అభ్యర్థి షబ్బీర్ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని, సమష్టి కృషితో సర్పంచి ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని నాయకులు పేర్కొన్నారు. అలాగే సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ గత జగనన్న పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు. వేంపల్లె అభివృద్ధి కేవలం వైఎస్ కుటుంబంతోనే సాధ్యమన్నారు. వేంపల్లె సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామని, తనను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి విజయాన్ని అందించాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ శివమ్మ, వైసిపి ఉపాధ్యక్షులు మునీర్, రవిశంకర్ గౌడ్, నాయకులు రామచంద్రారెడ్డి, సాదక్ వలి, సల్మా, భారతీ, పలువురు ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : గండికోట షేక్ ఖదీర్
వేంపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లా.