telangana
నార్నూర్ లో వైభవంగా కాకడ హారతి
సూర్య నార్నూర్ : నార్నూర్ మండల కేంద్రంలో పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని స్థానిక ఆలయాల్లో కాకడ హారతి ఉత్సవాలను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ఉదయం బ్రహ్మ ముహూర్తాన ప్రత్యేక పూజలు నిర్వహించే గ్రామంలో శోభయాత్ర నిర్వహించారు. అనంతరం మహా హారతి నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి గజానంద్ నాయక్ మాట్లాడుతూ.. పవిత్ర కార్తీక మాసం కురు పురస్కరించుకొని ప్రజలు ప్రతిరోజు దీపారాధన చేసి గ్రామంలో శోభాయాత్ర నిర్వహించడం ఎంతో అభినందనీయం అన్నారు. దీని ద్వారా నేటి యువత చెడు వ్యసనాలు వదిలి ఆధ్యాత్మికతవైప పయనిస్తారన్నారు. Angry కార్తీక మాసం ముగింపు సందర్భంగా నిర్వహించే మహా పూజలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆధ్యాత్మిక పొందాలని సూచించారు. అనంతరం గ్రామంలో భారీ శోభాయాత్ర నిర్వహించడంతో ఆప్రాంతమంతా ఆధ్యాత్మికంగా మారిపోయింది. వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు..