BREAKING
దిందా గ్రామంలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభం వైసీపీ సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి వైభవంగా పలమనేరు పురపాలక సంఘ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అమర్, సినీ నటుడు సుమన్ హాజరు చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి, వైస్ చైర్మన్‌గా జనసేనకు చెందిన మురాద్ ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంను సద్వినియోగం చేసుకోవాలి:గొట్టిముక్కల సర్పంచ్ సుద్దగళ్ల సంగీతా లింగమయ్య సారస్వత నికేతనాన్ని సందర్శించిన పరకాల ప్రభాకర్** ఇందిరమ్మ భీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి -జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డా. రాథోడ్ జైసింగ్ రేపు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడిః ఎంపీ, ఆర్. కృష్ణయ్య పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అండ. చెత్తకుప్పల్లో బ్యాలెట్లు.. ఎన్నికల వ్యవస్థకే సిగ్గుచేటు మిట్టపాలెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య ఎన్నికల విధులకు జూనియర్ అసిస్టెంట్ గైర్హాజరు.. అధికారుల ఉదాసీనతపై విమర్శలు! ఏషియన్-ఇండియా మారిటైం కాంక్లేవ్ లో విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి లోకేష్ ‎‎ప్రజల సంపదను ప్రజలకే పంచుతున్న ప్రజా ప్రభుత్వంః ‎‎డిప్యూటీ సీఎం భట్టి నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీధర్ తొలి సంతకం....

రేపు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడిః ఎంపీ, ఆర్. కృష్ణయ్య

Select Suryaa Now
రేపు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడిః ఎంపీ, ఆర్. కృష్ణయ్య



సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఆందోళనకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్‌లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడించి ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాలని విద్యార్థులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సుమారు 16 లక్షల మంది కళాశాల విద్యార్థులకు సంబంధించిన ఫీజుల బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కోర్సులు పూర్తి చేసిన సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తున్నాయని, ఫీజులు చెల్లించే వరకు చదువుతున్న విద్యార్థులకు తదుపరి సంవత్సరం ప్రవేశాలు కల్పించడం లేదని విమర్శించారు. గత ఆరు నెలలుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.8 వేల కోట్ల ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా గతంలో అమలైన పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేయరాదని హైకోర్టు తీర్పులు, ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ కళాశాలలు వాటిని పట్టించుకోకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు.
భూములు విక్రయిస్తూ, లక్షల కోట్ల రూపాయల అప్పులు తెస్తూ, వివిధ మార్గాల్లో భారీ ఆదాయం సమకూర్చుకుంటున్న ప్రభుత్వానికి పేద విద్యార్థుల చదువుల కోసం రూ.8 వేల కోట్లు కేటాయించడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తున్న ప్రభుత్వం, 14 నుంచి 16 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజులు, స్కాలర్‌షిప్‌లు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, పేద కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పొందారని, ఈ పథకం సమాజంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని పేర్కొన్నారు. అలాంటి పథకానికి నిధులు కేటాయించకుండా నీరుగార్చడం పేద వర్గాల విద్యాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, బీసీ సంఘాలు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలతో చర్చించాలని కోరారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.