నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీధర్ తొలి సంతకం....
నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీధర్ తొలి సంతకం....
శివాలయాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలకు రూ.18 వేలు.... డంపింగ్ యార్డు వద్ద ఫెన్సింగ్‌కు రూ.8.25 లక్షలు ప్రతిపాదన....
|అమలాపురం మేజర్ న్యూస్ పురపాలక సంఘ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి సంతకంతో ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారు. కార్తీక మాసం సందర్భంగా పట్టణంలోని ప్రముఖ శివాలయాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు భక్తులకు మంచినీరు, ప్రసాదం పంపిణీ చేసేందుకు రూ.18 వేల వ్యయంతో ప్రతిపాదనను కౌన్సిల్ ముందుంచారు. అలాగే 8వ వార్డు గరిగుంటలోని మున్సిపల్ ఎంసీ సెంటర్‌కు మందుల కొనుగోలుకు రూ.2,90,100 మంజూరు, బైపాస్ రోడ్డులోని డంపింగ్ యార్డు పక్కన పంట కాలువలోకి చెత్త చేరకుండా 300 మీటర్ల పొడవున ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ.8.25 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్యం, భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా నూతన చైర్మన్ తొలి సంతకంతోనే పాలనలో తన ప్రాధాన్యతలను చాటుకున్నట్లు అయింది.