చైర్మన్ హోదాలోనూ.. చెక్కుచెదరని మాతృప్రేమ*
*చైర్మన్ హోదాలోనూ.. చెక్కుచెదరని మాతృప్రేమ*
* ఒకవైపు చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం.. మరోవైపు బిడ్డకు తల్లి ప్రేమ
* అందరి దృష్టిని ఆకర్షించిన మాతృమమకారం
- చీరాల: ఒకవైపు మున్సిపల్ చైర్మన్‌గా పాలనా పగ్గాలు చేపట్టారు.. మరోవైపు పసిబిడ్డకు తల్లిగా తన బాధ్యతను మరిచిపోలేదు. చీరాల మున్సిపల్ చైర్మన్‌గా హాని స్పందన సోమవారం వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె తన పసిబిడ్డతో కలిసి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం బిడ్డ ఏడుస్తుండటంతో చైర్మన్ కుర్చీలోనే కూర్చొని బిడ్డను ఒడిలోకి తీసుకుని లాలించారు.ఒకవైపు చైర్మన్ హోదాలో బాధ్యతలు స్వీకరిస్తూనే.. మరోవైపు తల్లిగా బిడ్డపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. పదవీ బాధ్యతల కంటే మాతృప్రేమకు ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేసిన ఈ దృశ్యం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.