BREAKING
‎‎ప్రజల సంపదను ప్రజలకే పంచుతున్న ప్రజా ప్రభుత్వంః ‎‎డిప్యూటీ సీఎం భట్టి నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీధర్ తొలి సంతకం.... తడగొండలో ఆగ్రో సబ్ సెంటర్ ప్రారంభం.. చైర్మన్ హోదాలోనూ.. చెక్కుచెదరని మాతృప్రేమ* 37వ డివిజన్ కార్పొరేటర్ గా అనురాధ ప్రమాణ స్వీకారం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 15 మంది ఉద్యోగులకు టీఎన్జీవో సభ్యత్వం సీఎం సహాయనిధి అందజేత ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలిః మంత్రి వాకిటి శ్రీహరి వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఎల్. నగరం వార్డ్ నెంబర్ 5 నామినేషన్ దాఖలు కేటీఆర్‌వి పగటి కలలుః ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ నెల 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీః మహేష్ కుమార్ గౌడ్ అనారోగ్యంతో ఉన్న కార్యకర్తకు కాటసాని భరోసా! జర్నలిస్టు వెంకటరమణ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై తెదేపాలో రచ్చ..! కాంగ్రెస్ కార్యకర్తల త్యాగాలకు తగిన గుర్తింపు కల్పించాలిః మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కేటీఆర్‌వి పగటి కలలుః ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Select Suryaa Now
కేటీఆర్‌వి పగటి కలలుః ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ చెబుతున్నారని, 500 రోజులు కాదు.. 5 వేల రోజులైనా కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కాలేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రజా సమస్యల కంటే అధికార దాహంతోనే కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని విధ్వంసకరంగా పరిపాలించారని ఆరోపించారు. కేటీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, 2023 డిసెంబర్ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని అన్నారు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పనితీరు శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని అంతం చేయడం కేసీఆర్ వల్లే కాలేదని, ఇక కేటీఆర్ వల్ల ఏమవుతుందని ప్రశ్నించారు. పేద ప్రజలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీనేనని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.