BREAKING
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 15 మంది ఉద్యోగులకు టీఎన్జీవో సభ్యత్వం సీఎం సహాయనిధి అందజేత ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలిః మంత్రి వాకిటి శ్రీహరి వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఎల్. నగరం వార్డ్ నెంబర్ 5 నామినేషన్ దాఖలు కేటీఆర్‌వి పగటి కలలుః ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ నెల 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీః మహేష్ కుమార్ గౌడ్ అనారోగ్యంతో ఉన్న కార్యకర్తకు కాటసాని భరోసా! జర్నలిస్టు వెంకటరమణ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై తెదేపాలో రచ్చ..! కాంగ్రెస్ కార్యకర్తల త్యాగాలకు తగిన గుర్తింపు కల్పించాలిః మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవులు శాశ్వతం కాదు.. అభివృద్ధి పనులే శాశ్వతంః మంత్రి వాకిటి శ్రీహరి గోదావరి పుష్కరాల లోగోకు రూ.1 లక్ష బహుమతిః మంత్రి పొన్నం పిలుపు పోలింగ్ సందర్భంగా నవంబరు 26, 29, డిసెంబరు 2న సెలవు 24 సాయంత్రం నుండి మద్యం దుకాణాలు బంద్ ఎన్నికల నిబంధనలను ఆర్ఓలకు తెలియజేసిన ఎంపీడీఓ

ఈ నెల 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీః మహేష్ కుమార్ గౌడ్

Select Suryaa Now
ఈ నెల 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీః మహేష్ కుమార్ గౌడ్

సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు సాధించి 90 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ నూతన ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి బి.ఎం. సందీప్‌కు ఘన స్వాగతం పలికామని తెలిపారు. ఆయన పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో పాల్గొన్నారని వెల్లడించారు. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సమగ్రంగా వివరించారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తారని స్పష్టం చేశారు. సాయంత్రం ఏఐసీసీ ఇన్‌ఛార్జి బి.ఎం. సందీప్ జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులతో విడివిడిగా సమావేశమై పార్టీ పరిస్థితి, సంస్థాగత అంశాలపై చర్చించనున్నారని తెలిపారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 26న హైదరాబాద్‌లో సంవిధాన్ రక్షక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. లిబర్టీ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీ చేపడుతోందని తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.