BREAKING
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 15 మంది ఉద్యోగులకు టీఎన్జీవో సభ్యత్వం సీఎం సహాయనిధి అందజేత ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలిః మంత్రి వాకిటి శ్రీహరి వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఎల్. నగరం వార్డ్ నెంబర్ 5 నామినేషన్ దాఖలు కేటీఆర్‌వి పగటి కలలుః ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ నెల 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీః మహేష్ కుమార్ గౌడ్ అనారోగ్యంతో ఉన్న కార్యకర్తకు కాటసాని భరోసా! జర్నలిస్టు వెంకటరమణ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై తెదేపాలో రచ్చ..! కాంగ్రెస్ కార్యకర్తల త్యాగాలకు తగిన గుర్తింపు కల్పించాలిః మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవులు శాశ్వతం కాదు.. అభివృద్ధి పనులే శాశ్వతంః మంత్రి వాకిటి శ్రీహరి గోదావరి పుష్కరాల లోగోకు రూ.1 లక్ష బహుమతిః మంత్రి పొన్నం పిలుపు పోలింగ్ సందర్భంగా నవంబరు 26, 29, డిసెంబరు 2న సెలవు 24 సాయంత్రం నుండి మద్యం దుకాణాలు బంద్ ఎన్నికల నిబంధనలను ఆర్ఓలకు తెలియజేసిన ఎంపీడీఓ

జర్నలిస్టు వెంకటరమణ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం

Select Suryaa Now
  జర్నలిస్టు వెంకటరమణ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం

సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధి: హైదరాబాద్ లోని అంబర్ పేటలో గుండెపోటుతో హఠాన్మ ణం చెందిన జర్నలిస్టు వనం వెంకటరమణ బౌతిక కాయానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య నివాలర్పించారు. సోమవారం ఉదయం ఆయన అంబర్ పేటలోని వెంకటరమణ ఇంటికి వెళ్ళి ఆయన భౌతిక కాయం పై పూలమాల ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యడు కుంచం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్, ఫెడరేషన్ నాయకులు సతీష్ ముదిరాజ్, వర్కాల కిష్టయ్య, యాదయ్య తదితరులు కూడా వెంకటరమణ బౌతిక కాయంపై పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య వెంకటరమణ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పదేళ్ళుగా జర్నలిజం వృత్తిలో కొనసాగిన వెంకటరమణ చిన్న వయసులోనే గుండెపోటుకు గురై చనిపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. జర్నలిజం వృత్తిని నమ్ముకొని, నీతి నిజాయితీతో పని చేశారని, జర్నలిజంలో ఎదుగుతున్న తరుణంలో ఇలా జరగడం విచారకరమని మామిడి సోమయ్య పేర్కొన్నారు. పలు టీవీ చానళ్ళు,పత్రికల్లో రిపోర్టర్ గా నిబద్ధతతో పని చేసిన వెంకటమరణ ఇటీవల తెలుగు ప్రభ పత్రికలో రిపోర్టర్ గా చేరి తన వృత్తిని అంకితభావంతో కొనసాగించారని అన్నారు.  అత్యంత పేదరికంలో ఉన్న వెంకటరమణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మామిడి సోమయ్య కోరారు. వెంకటరమణ లాంటి ఎంతోమంది జర్నలిస్టులు ఏళ్ళతరబడి జర్నలిస్టుగా పనిచేసి చివరికి పేదరికంతో, అనారోగ్యంతో చనిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ప్రభుత్వం కనీసం ఉచిత వైద్యం, పింఛన్ వంటి సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.