BREAKING
ఈ నెల 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీః మహేష్ కుమార్ గౌడ్ అనారోగ్యంతో ఉన్న కార్యకర్తకు కాటసాని భరోసా! జర్నలిస్టు వెంకటరమణ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై తెదేపాలో రచ్చ..! కాంగ్రెస్ కార్యకర్తల త్యాగాలకు తగిన గుర్తింపు కల్పించాలిః మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవులు శాశ్వతం కాదు.. అభివృద్ధి పనులే శాశ్వతంః మంత్రి వాకిటి శ్రీహరి గోదావరి పుష్కరాల లోగోకు రూ.1 లక్ష బహుమతిః మంత్రి పొన్నం పిలుపు పోలింగ్ సందర్భంగా నవంబరు 26, 29, డిసెంబరు 2న సెలవు 24 సాయంత్రం నుండి మద్యం దుకాణాలు బంద్ ఎన్నికల నిబంధనలను ఆర్ఓలకు తెలియజేసిన ఎంపీడీఓ కొబ్బరికాయలో శివలింగాకారం.. భక్తులలో భక్తిభావం ! సింగరేణిలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు షేర్ మొహమ్మద్ పేటలో కూటమి అభ్యర్థిని షేక్ సమీనా నాగులు మీరా కి పెరుగుతున్న మద్దతు. గోళ్లపాడు రైతుల కల సాకారం.. పొంగులేటి రాజకీయ చొరవతో కొత్త సొసైటీ!

పదవులు శాశ్వతం కాదు.. అభివృద్ధి పనులే శాశ్వతంః మంత్రి వాకిటి శ్రీహరి

Select Suryaa Now
  పదవులు శాశ్వతం కాదు.. అభివృద్ధి పనులే శాశ్వతంః మంత్రి వాకిటి శ్రీహరి

సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః మక్తల్ ప్రాంత విద్యాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. మక్తల్‌లోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద 9 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర క్రీడా, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మక్తల్‌ను విద్యా, క్రీడా రంగాల్లో రాష్ట్రంలోనే ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. సాధారణంగా డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం 6 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయిస్తుందని, అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ప్రత్యేక చొరవ తీసుకొని మక్తల్ డిగ్రీ కళాశాల కోసం 9 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చానని తెలిపారు. గతంలో డిగ్రీ కళాశాల లేక ఎంతోమంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేసిన పరిస్థితి ఉండేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.ఇన్నేళ్లుగా మక్తల్‌కు డిగ్రీ కళాశాల ఎందుకు రాలేదో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలోచించాలని ఆయన అన్నారు. గతంలో సరిపడా విద్యార్థులు లేరనే కారణంతో కళాశాలను రద్దు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం మక్తల్‌లో 540 మంది విద్యార్థులు డిగ్రీ చదువుతుండటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. గతంలో మాదిరిగా కాకుండా భూమిపూజ చేసిన రోజే పనులు ప్రారంభించే అలవాటు తనదని, వచ్చే ఏడాది కార్తీక మాసంలో నూతన డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా త్వరలోనే మక్తల్‌కు పీజీ కళాశాలను కూడా తీసుకొస్తానని మంత్రి ప్రకటించారు. ఈ ప్రాంతంలో పుట్టి, ఇదే ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్న మంత్రి.. నియోజకవర్గంలో సుమారు 2 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. అయితే ఇన్నేళ్లపాటు ఈ ప్రాంతం వెనుకబడి ఉండటం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు సేవ చేయడం తన బాధ్యతని, మక్తల్‌తో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తన తపన అని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే వెటర్నరీ రీసెర్చ్ సెంటర్‌ను తీసుకొచ్చామని, మక్తల్‌కు న్యాయవాదులు వచ్చి కోర్టులో విధులు నిర్వహించే స్థాయిలో న్యాయవ్యవస్థకు ప్రాధాన్యత పెరిగిందని ఆయన తెలిపారు. వచ్చే నెలలో 150 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకోబోతున్నామని, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయ కోనేరు, ఆలయ గోపురం, ఈద్గా వద్ద మసీదు అభివృద్ధి పనులు ఎలా జరిగాయో ప్రజలు గమనించాలని అన్నారు. సంగంబండ ప్రాజెక్టులో అదనంగా మరో టీఎంసీ నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ పనులకు అవసరమైన ఇసుకను స్థానికంగానే వినియోగిస్తున్నామని, గతంలో మాదిరిగా మక్తల్ ప్రాంత ఇసుకను హైదరాబాద్‌కు తరలించడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రభుత్వ అభివృద్ధి పనులకే ఇసుకను వినియోగిస్తున్నామని చెప్పారు. మక్తల్‌లో అధునాతన సౌకర్యాలతో స్టేడియం నిర్మించాలన్నది తన సంకల్పమని, అయితే కొందరు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. మక్తల్‌ను ఒక స్టడీ హబ్‌గా, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతానని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
పదవులు శాశ్వతం కాదని, మనం చేసిన అభివృద్ధి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని మంత్రి పేర్కొన్నారు. మన జీవితాలు మనం పుట్టిన ఊరితో ముడిపడి ఉంటాయని, మన ఊరును అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో  నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక, మక్తల్ మున్సిపల్ చైర్మన్ వాకిటి మానస హన్మంతు, కౌన్సిలర్ అల్కూరి పావని, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.