షేర్ మొహమ్మద్ పేటలో కూటమి అభ్యర్థిని షేక్ సమీనా నాగులు మీరా కి పెరుగుతున్న మద్దతు.
షేర్ మొహమ్మద్ పేటలో కూటమి అభ్యర్థిని షేక్ సమీనా నాగులు మీరా కి పెరుగుతున్న మద్దతు..
సుమారు వెయ్యి ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు
జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :- షేర్ మొహమ్మద్ పేట గ్రామంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని షేక్ సమీనా నాగులు మీరాకు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఆమెకు మంచి స్పందన, ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరినీ కలుపుకొని వెళ్లే మనస్తత్వం, సౌమ్యమైన వ్యక్తిత్వం, వినయవిధేయతలు షేక్ సమీనా నాగులు మీరాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నట్లు నాయకులు తెలిపారు. గ్రామంలోని ప్రతి కుటుంబంతో ఆత్మీయంగా మెలుగుతూ ప్రజల మన్ననలు పొందుతున్న ఆమెనే సర్పంచ్‌గా గెలిపించుకుంటామని పలువురు గ్రామస్తులు ధీమా వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, గ్రామంలో ఏ సమస్యలు తలెత్తినా వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూ ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగడం ఆమెకు ప్రజల్లో ఆదరణ పెరగడానికి ప్రధాన కారణమని నాయకులు వివరించారు.
అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల గ్రామ ప్రజలు సంతోషంగా ఉన్నారని, గ్రామ అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే కూటమి అభ్యర్థిని విజయం అవసరమని గ్రామస్తులు భావిస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుభాని, పార్టీ నాయకులు మాట్లాడుతూ.. గ్రామంలో కూటమి అభ్యర్థికి రోజురోజుకూ మద్దతు పెరుగుతోందని, ప్రజల ఆదరణ చూస్తుంటే సుమారు వెయ్యి ఓట్ల భారీ మెజారిటీతో షేక్ సమీనా నాగులు మీరా విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రిపోర్టర్ :-శివారెడ్డి జగ్గయ్యపేట రూరల్ ఎన్టీఆర్ జిల్లా