BREAKING
సూపర్‌మేన్‌లా డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన కుమార్ కుషాగ్ర.. యూఏఈ మ్యాచ్‌లో అద్భుతం! కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్.. హర్‌ప్రీత్ సెంచరీ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం! ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి - కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావినిల సత్యనారాయణ బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం పరిష్కారం .. 39 ఏళ్ల తర్వాత మర్లపూడిలో టీడీపీ జెండా రెపరెపలు.. విజయానికి యువ నాయకుడు వరదబండి వెంకటేశ్వర్లు రెడ్డి కృషి కీలకం! కష్టాల్లో ఉన్న కుటుంబానికి జిల్లా కలెక్టర్ చేయూత పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం - మోటివేషన్ ట్రైనర్ ఎస్ ధర్మారెడ్డి సూర్యవంశీ సిక్సర్ల సునామీ.. డాక్టర్ తలారి రంగయ్య పై అసత్య ప్రచారాలు తగవు... సిబిఐ విచారణకు సిద్ధమా? దహెగాంలో రావుల మల్లన్న భక్తుల పవిత్ర గంగా స్నానాలు టీడీపీకి బీజేపీ బిగ్ షాక్..! -కూటమిలో కుదరని పొత్తులు..!! మండపం బరిలో ముగ్గురు లక్ష్మీలు...!!! అపస్మా నూతన కార్యవర్గ ఎంపిక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవ సర్పంచ్. కార్మిక హక్కుల రక్షణ కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటి యు ఆధ్వర్యంలో ర్యాలీ

24 సాయంత్రం నుండి మద్యం దుకాణాలు బంద్

Select Suryaa Now
24 సాయంత్రం నుండి మద్యం దుకాణాలు బంద్

గుంటూరు : మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ, పొన్నూరు మున్సిపాలిటీలో నవంబర్ 26వ తేదీన పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆయా పరిధిలో మద్యం దుకాణాలలో ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి విక్రయాలు నిలుపుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగర పాలక సంస్థల చట్టం 1955, రాష్ట్ర పురపాల చట్టం 1965 లలో గల నిబంధనల మేరకు విక్రయాలు నిలుపుదల చేయడం జరుగుతుంద న్నారు.నవంబరు 30వ తేదీన కౌంటింగ్ ఉన్నందున, 48 గంటల ముందు నుండి మద్యం విక్రయాలు చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్నికల నిబంధనలు, సంబంధిత చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నవంబరు 29, డిసెంబరు 2వ తేదీన పంచాయతీ పోలింగ్ జరుగుతున్నందున పోలింగ్ ప్రక్రియ ముగిసే 48 గంటల ముందు నుండి మద్యం దుకాణాలు విక్రయాలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు.