కొబ్బరికాయలో శివలింగాకారం.. భక్తులలో భక్తిభావం !
తుర్కయంజాల్, మేజర్ న్యూస్.
కార్తీక మాసంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తున్న వేళ ఓ ఆసక్తికర ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది.తుర్కయంజాల్ డివిజన్ పరిధిలోని నీలం సంజీవరెడ్డి నగర్ కాలనీలో ఉన్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం ఓ భక్తుడు స్వామివారికి కొబ్బరికాయ కొట్టగా, అందులో శివలింగాన్ని పోలిన ఆకారం కనిపించింది.ఈ అరుదైన దృశ్యాన్ని గమనించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. కొబ్బరికాయలో కనిపించిన శివలింగాకారాన్ని భక్తితో పూజిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న మరికొందరు భక్తులు కూడా ఆలయానికి చేరుకుని దర్శించుకున్నారు.
కార్తీక మాసంలో శివారాధనకు విశేష ప్రాధాన్యత ఉండటంతో, కార్తీక పౌర్ణమికి ముందు రోజు ఇలా శివలింగాకారం కనిపించడం శుభపరిణామమని పలువురు భక్తులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, కొబ్బరికాయలో శివలింగాకారం కనిపించిందన్న వార్త కాలనీలో చర్చనీయాంశంగా మారింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎల్మటి వెంకట్ రెడ్డి, గోదాస్ భద్రయ్య, నరేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
. ఎడ్ల వెంకటేష్ గౌడ్, మేజర్ న్యూస్, తుర్కయంజాల్.