అనారోగ్యంతో ఉన్న కార్యకర్తకు కాటసాని భరోసా!
అనారోగ్యంతో ఉన్న కార్యకర్తకు కాటసాని భరోసా!
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
మండ పరిధిలోన పాలకొలను గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురువ శ్రీనివాసులు అనారోగ్యంతో కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్‌లో ఉన్న ఆకాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి శ్రీనివాసులును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులుకు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు పాలకొలను గ్రామానికి చెందిన రమేష్ తదితరులు పాల్గొన్నారు