BREAKING
చెత్తకుప్పల్లో బ్యాలెట్లు.. ఎన్నికల వ్యవస్థకే సిగ్గుచేటు మిట్టపాలెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య ఎన్నికల విధులకు జూనియర్ అసిస్టెంట్ గైర్హాజరు.. అధికారుల ఉదాసీనతపై విమర్శలు! ఏషియన్-ఇండియా మారిటైం కాంక్లేవ్ లో విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి లోకేష్ ‎‎ప్రజల సంపదను ప్రజలకే పంచుతున్న ప్రజా ప్రభుత్వంః ‎‎డిప్యూటీ సీఎం భట్టి నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీధర్ తొలి సంతకం.... తడగొండలో ఆగ్రో సబ్ సెంటర్ ప్రారంభం.. చైర్మన్ హోదాలోనూ.. చెక్కుచెదరని మాతృప్రేమ* 37వ డివిజన్ కార్పొరేటర్ గా అనురాధ ప్రమాణ స్వీకారం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 15 మంది ఉద్యోగులకు టీఎన్జీవో సభ్యత్వం సీఎం సహాయనిధి అందజేత ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలిః మంత్రి వాకిటి శ్రీహరి వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఎల్. నగరం వార్డ్ నెంబర్ 5 నామినేషన్ దాఖలు కేటీఆర్‌వి పగటి కలలుః ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ నెల 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీః మహేష్ కుమార్ గౌడ్

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలిః మంత్రి వాకిటి శ్రీహరి

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలిః మంత్రి వాకిటి శ్రీహరి

సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః మక్తల్ పట్టణంలోని 8వ వార్డులో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర క్రీడా,పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్‌ ప్రియాంకతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల నమోదు ప్రక్రియను, అర్హత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ....పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందన్నారు. కుటుంబానికి అండగా నిలిచే వ్యక్తికి అనుకోని ప్రమాదం జరిగినా, ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.