37వ డివిజన్ కార్పొరేటర్ గా అనురాధ ప్రమాణ స్వీకారం
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్.చిత్తూరు నగరపాలక సంస్థ పరిధి లోని 37 వ డివిజన్ కార్పొరేటర్ గా అనురాధ చిట్టిబాబు కొల్లా సోమవారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, చిత్తూరు మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ గోపీనాథ్, నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 37 వ డివిజన్ ను స్మార్ట్ డివిజన్ గా తీర్చిదిద్దుతానని అన్నారు. కూటమి ప్రభుత్వం లో చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆధ్వర్యంలో చిత్తూరు నియోజకవర్గం అనేక విధాలుగా అభివృద్ధి చెందడం జరిగిందని, తమ డివిజన్లో అన్ని రంగాలలో అభివృద్ధి చేపట్టి ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసేలా కృషి చేస్తానని తెలిపారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.