తడగొండలో ఆగ్రో సబ్ సెంటర్ ప్రారంభం..
సూర్య
బోయినపల్లి.. మండలం తడగొండ గ్రామంలో సోమవారం ఆగ్రో సబ్ సెంటర్ ను ప్రారంభించారు. మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ను సర్పంచ్ శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, మల్కాపూర్, తడగొండ, అనంతపల్లె గ్రామాల రైతులకు మందులు, బస్తాలు అందుబాటులో ఉంటాయని, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్,ఉప సర్పంచ్ వెంకటేష్, తిరుపతి, సింగిల్ విండో మాజీ చైర్మన్ కిషన్ రెడ్డి, ఆత్మ కమిటీ మెంబర్ గుడి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.