BREAKING
ఇందిరమ్మ భీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి -జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డా. రాథోడ్ జైసింగ్ రేపు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడిః ఎంపీ, ఆర్. కృష్ణయ్య పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అండ. చెత్తకుప్పల్లో బ్యాలెట్లు.. ఎన్నికల వ్యవస్థకే సిగ్గుచేటు మిట్టపాలెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య ఎన్నికల విధులకు జూనియర్ అసిస్టెంట్ గైర్హాజరు.. అధికారుల ఉదాసీనతపై విమర్శలు! ఏషియన్-ఇండియా మారిటైం కాంక్లేవ్ లో విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి లోకేష్ ‎‎ప్రజల సంపదను ప్రజలకే పంచుతున్న ప్రజా ప్రభుత్వంః ‎‎డిప్యూటీ సీఎం భట్టి నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీధర్ తొలి సంతకం.... తడగొండలో ఆగ్రో సబ్ సెంటర్ ప్రారంభం.. చైర్మన్ హోదాలోనూ.. చెక్కుచెదరని మాతృప్రేమ* 37వ డివిజన్ కార్పొరేటర్ గా అనురాధ ప్రమాణ స్వీకారం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 15 మంది ఉద్యోగులకు టీఎన్జీవో సభ్యత్వం సీఎం సహాయనిధి అందజేత

పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అండ.

Select Suryaa Now
పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అండ.

శెట్టూరు: పేదరికం కారణంగా విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోకూడదనే సంకల్పంతో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థినుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో చదువును కొనసాగించలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థినులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తోంది. ఈ క్రమంలో శెట్టూరు మండలం మాకొడికి తాండాకు చెందిన ఐదుగురు విద్యార్థినుల ఉన్నత చదువులకు ట్రస్ట్ సభ్యులు చేయూత అందించడం అభినందనీయం. మాకొడికి తాండాకు చెందిన సక్రె నాయక్, సాలమ్మ దంపతుల కుమార్తె మంజుల అనంతపురం పట్టణంలోని ఓ ప్రముఖ కళాశాలలో బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండటంతో కళాశాల ఫీజు రూ.38 వేలు చెల్లించలేక ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఫీజు బకాయి కారణంగా పరీక్షలకు హాజరయ్యే విషయంలోనూ సమస్యలు తలెత్తాయి. ఈ విషయం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బద్దే నాయక్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. విద్యార్థిని చదువుకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో బద్దే నాయక్ కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించి పరిస్థితిని వివరించారు. ఫీజు చెల్లించేందుకు నాలుగు రోజుల గడువు ఇవ్వాలని కోరారు. ఆయన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కళాశాల యాజమాన్యం విద్యార్థిని పరీక్ష రాసేందుకు అనుమతించింది. అనంతరం విద్యార్థిని చదువుకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చిన ట్రస్ట్ ఛైర్మన్ బద్దే నాయక్, నేడు కళాశాల పేరు మీదుగా రూ.30 వేల చెక్కును విద్యార్థిని కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంతో మంజుల ఉన్నత చదువులు కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఒక్క మంజులకే పరిమితం కాలేదు. ఇదే మాకొడికి తాండాకు చెందిన మరో నలుగురు విద్యార్థినులతో కలిపి మొత్తం ఐదుగురు విద్యార్థినుల ఉన్నత విద్యకు ట్రస్ట్ సభ్యులు సహకారం అందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఆడపిల్లల చదువులు ఆగకూడదనే లక్ష్యంతో వారికి అవసరమైన ప్రోత్సాహం, సహాయ సహకారాలు అందిస్తూ విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ ఉన్నప్పటికీ సరైన ఆర్థిక సహకారం లేక ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. అలాంటి విద్యార్థులను గుర్తించి వారికి అండగా నిలవడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని ట్రస్ట్ సభ్యులు తమ సేవా కార్యక్రమాల ద్వారా చాటుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల విద్యకు ప్రాధాన్యతనిస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడం ప్రశంసనీయం. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రోత్సాహం అందాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐదుగురు విద్యార్థినుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బద్దే నాయక్, ట్రస్ట్ సభ్యుల సేవా స్ఫూర్తి మరెందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మహేష్, వన్నప్ప, శ్రీధర్ పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.