BREAKING
ఇందిరమ్మ భీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి -జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డా. రాథోడ్ జైసింగ్ రేపు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడిః ఎంపీ, ఆర్. కృష్ణయ్య పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అండ. చెత్తకుప్పల్లో బ్యాలెట్లు.. ఎన్నికల వ్యవస్థకే సిగ్గుచేటు మిట్టపాలెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య ఎన్నికల విధులకు జూనియర్ అసిస్టెంట్ గైర్హాజరు.. అధికారుల ఉదాసీనతపై విమర్శలు! ఏషియన్-ఇండియా మారిటైం కాంక్లేవ్ లో విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి లోకేష్ ‎‎ప్రజల సంపదను ప్రజలకే పంచుతున్న ప్రజా ప్రభుత్వంః ‎‎డిప్యూటీ సీఎం భట్టి నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీధర్ తొలి సంతకం.... తడగొండలో ఆగ్రో సబ్ సెంటర్ ప్రారంభం.. చైర్మన్ హోదాలోనూ.. చెక్కుచెదరని మాతృప్రేమ* 37వ డివిజన్ కార్పొరేటర్ గా అనురాధ ప్రమాణ స్వీకారం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 15 మంది ఉద్యోగులకు టీఎన్జీవో సభ్యత్వం సీఎం సహాయనిధి అందజేత

చెత్తకుప్పల్లో బ్యాలెట్లు.. ఎన్నికల వ్యవస్థకే సిగ్గుచేటు

Select Suryaa Now
చెత్తకుప్పల్లో బ్యాలెట్లు.. ఎన్నికల వ్యవస్థకే సిగ్గుచేటు

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి.*
ఎన్నికల వ్యవస్థ సిగ్గుపడేలా చెత్త కుప్పలు బ్యాలెట్ పత్రాలు కనిపించడం లాంటి దారుణమైన సంఘటన చోటుచేసుకుందని టిడిపి మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్రప్రసాద్ ప్రకటనలో విమర్శించారు. ఇటీవల గోనెగండ్ల జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఎమ్మిగనూరు జూనియర్ కళాశాల వద్ద చెత్తకుప్పలో బ్యాలెట్ పత్రాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోందన్నారు.ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన బ్యాలెట్ పత్రాలను నిర్లక్ష్యంగా చెత్తకుప్పల్లో పడేయడం ఎన్నికల వ్యవస్థకు సిగ్గుచేటని విమర్శించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాలెట్ పత్రాల భద్రత, ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని అయన విజ్ఞప్తి చేశారు.
*A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు,
కర్నూలు జిల్లా*