telangana
ఇందిరమ్మ భీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా
సూర్య జైనూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించనుందని గుడామామడ గ్రామ సర్పంచ్ యశోద కేశవ్ అన్నారు. గ్రామంలోని అర్హులైన కుటుంబాలందరికీ ఈ పథకంపై అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ.. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించడం ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.గ్రామస్థులు ఈ పథకానికి సంబంధించిన వివరాలను తెలుసుకొని, అవసరమైన పత్రాలతో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు అందుబాటులో ఉంటే వాటి వివరాలు, మొబైల్ నంబర్‌తో పాటు నామినీల వివరాలను సక్రమంగా అందించాలని తెలిపారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా గ్రామపంచాయతీ తరఫున కృషి చేస్తామని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సర్పంచ్ యశోద కేశవ్ తెలిపారు. ఈ కార్యక్రమం పంచాయతీ సెక్రటరీ ప్రేమసింగ్ గ్రామ ప్రజలు పాలుగోన్నారు