ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంను సద్వినియోగం చేసుకోవాలి:గొట్టిముక్కల సర్పంచ్ సుద్దగళ్ల సంగీతా లింగమయ్య
వికారాబాద్, మేజర్ న్యూస్:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ సుద్దగళ్ల సంగీత లింగమయ్య అన్నారు.సోమవారం వికారాబాద్ మండలంలోని గొట్టిముక్కల గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం కార్యక్రమం చేపట్టారు.అర్హులైన వారి వివరాలు ఆన్లైన్ లో నమోదు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా కుటుంబ జీవిత భీమా పథకం అందించి రూ.5 లక్షలు నామినికి అందిస్తుందన్నారు.ప్రజలు దీనికి ఎలాంటి ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదని,ప్రభుత్వమే అంత ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు.అర్హత కలిగిన ప్రతి కుటుంబంలోని రేషన్ కార్డుకు ఒకరికి మాత్రమే భీమా వర్తిస్తుందని అన్నారు.భీమా ఎవరికైతే చేసుకోవాల్సిన వ్యక్తి 18నుంచి 59 సంవత్సరాల లోపు ఉండాలని తెలియజేశారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజలకు అవసరం అగు సంక్షేమ పథకాలు తీసుకువచ్చి,అమలు చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరు ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం కు గ్రామ పంచాయతీలో ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని అన్నారు .ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీజ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.