వైభవంగా పలమనేరు పురపాలక సంఘ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అమర్, సినీ నటుడు సుమన్ హాజరు చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి, వైస్ చైర్మన్‌గా జనసేనకు చెందిన మురాద్ ప్రమాణ స్వీకారం
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు పట్టణంలో పురపాలక సంఘ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బజారు వీధి, గంగమ్మ గుడి వీధుల మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ర్యాలీకి తోడు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారుల సమక్షంలో నూతన కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి, వైస్ చైర్మన్‌గా జనసేన పార్టీకి చెందిన మురాద్ ప్రమాణ స్వీకారం చేయగా, వారితో పాటు నూతన కౌన్సిల్ సభ్యులు కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజల హర్షధ్వానాలతో మార్మోగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్ మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకంతో అందించిన విజయాన్ని బాధ్యతగా స్వీకరించాలని నూతన పాలకవర్గ సభ్యులకు సూచించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు పట్టణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ పలమనేరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు.ప్రముఖ సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా పాలన కొనసాగుతోందని, నూతనంగా బాధ్యతలు చేపట్టిన పురపాలక పాలకవర్గం కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌తో పాటు కౌన్సిల్ సభ్యులను మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం పలమనేరు పట్టణంలో రాజకీయ, సామాజిక వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. నూతన పాలకవర్గం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ పట్టణ అభివృద్ధికి బాటలు వేస్తుందని పట్టణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్