సారస్వత నికేతనాన్ని సందర్శించిన పరకాల ప్రభాకర్**
**సారస్వత నికేతనాన్ని సందర్శించిన పరకాల ప్రభాకర్**
**వేటపాలెం:** ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ సోమవారం వేటపాలెంలోని చారిత్రక సారస్వత నికేతనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి, గ్రంథాలయ చరిత్ర, విశిష్టతలను వివరించారు.
మహాత్మాగాంధీ వదిలివెళ్లిన చేతికర్ర, బాబు రాజేంద్రప్రసాద్ ఏర్పాటు చేసిన స్మారక ధ్వజస్తంభాన్ని పరిశీలించారు. అనంతరం అరుదైన పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు, పాత పత్రికలను తిలకించారు.సారస్వత నికేతనాన్ని సందర్శించాలన్న తన చిరకాల కోరిక నెరవేరిందని, ఇక్కడికి రావడం తీర్థయాత్రకు వచ్చిన అనుభూతిని కలిగించిందని సందర్శకుల రిజిస్టర్‌లో అభిప్రాయం నమోదు చేశారు. ఇంతటి చారిత్రక సంపదను భద్రపరుస్తున్న గ్రంథాలయ సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ మాచర్ల మోహన్ రావు, ఎన్. నాగార్జున రెడ్డి, దేవన వీర నాగేశ్వరరావు, గుంటూరు మల్లికార్జునరావు, మేడిబోయిన వెంకటరెడ్డి, కొల్లిపర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.