telangana
ఆర్‌పీల సమస్యలు పరిష్కరించాలి
సూర్య కాగజ్‌నగర్: మెప్మా పరిధిలో పనిచేస్తున్న ఆర్‌పీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని రాష్ట్ర సంఘం అధ్యక్షురాలు మానుకోట సునీత డిమాండ్ చేశారు.కాగజ్‌నగర్ పట్టణంలోని తీరందాజ్ బస్తీ అంబేద్కర్ భవనంలో సోమవారం జిల్లా అధ్యక్షురాలు పొన్న స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణ పేదల అభ్యున్నతి కోసం, మహిళా సంఘాల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న మెప్మా ఆర్‌పీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్‌పీల సేవలను ప్రభుత్వం గుర్తించాలని, వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి, ఉద్యోగ భద్రతతో పాటు న్యాయమైన వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఆర్‌పీల సమస్యల పరిష్కారం కోసం సంఘం తరఫున ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని మానుకోట సునీత స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలు పొన్న స్రవంతి, కార్యదర్శి కచ్చకాయల జ్యోతితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షురాలు అరుణ,, సంఘం ప్రతినిధులు, ఆర్‌పీలు పాల్గొన్నారు.