BREAKING
బేసిన్ రిజర్వ్‌లో అరుదైన డ్రా: 2015 తర్వాత 15 టెస్టుల్లో రెండోసారి మాత్రమే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లపై నవజోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు: క్రీడలపైనే దృష్టి పెట్టాలని పిలుపు ఆళ్లగడ్డ మున్సిపాలిలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి . ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోడిచెర్లలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్‌కు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ నిజమైన స్పిన్నర్ ఎక్కడ? కుల్దీప్, మానవ్ సుతార్‌లపై సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలు వెంటనే చెల్లించాలి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. హౌస్ అరెస్ట్ వెల్లింగ్టన్ టెస్టు డ్రాతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గండి: టీమిండియా ముందరి సమీకరణాలు ఇవే దీక్షా దివస్ సభకు ఇంటింటికీ వెళ్లి ఆహ్వానం బొంబాయిగూడ ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ కె.హరిత టెస్టు చరిత్రలో టీమిండియా అరుదైన ఘనత: ఒకే ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది బౌలర్లు

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ కె. హరిత

Select Suryaa Now
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ కె. హరిత
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రజావాణిలో వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్పురమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు లతో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన రంగు సందీప్ తాను సాగు చేస్తున్న ప్రభుత్వ భూమికి పట్టా మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. లింగాపూర్ మండలం పికక్తండా గ్రామానికి చెందిన బోడ సరిత తన కూతురు 10వ తరగతి చదువుతూ అనారోగ్యంతో మరణించిందని, తన కుటుంబానికి ఉపాధి కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడకు చెందిన తాజ్ బేగం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ మండలం కొమ్ముగూడ గ్రామానికి చెందిన వేముల మంజుల తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాగజ్ నగర్ పట్టణం నౌగాం బస్తీకి చెందిన షమీం భాను తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. రెబ్బెన మండలం ఎడవెల్లి గ్రామానికి చెందిన కార్నాతం పద్మ తన భర్త పేరిట గల భూమిని తన పేరిట పట్టా మార్పిడి చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. వాంకిడి మండలం ఎస్.టి. వార్డుకు చెందిన మడావి సంపత్ తన వాటాకు వచ్చిన భూమికి సంబంధించిన నూతన పాసుపుస్తకం జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సత్వరమే పరిష్కరించాలని తెలిపారు. గత ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాలని, ప్రజావాణికి వచ్చే అర్జీదారులు తమ గ్రామాలలో ఏర్పాటు చేసిన శిబిరాలలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం క్రింద 5 లక్షల రూపాయల బీమా చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.