03 సూర్య కరీంనగర్ : సెవెన్ హిల్స్ వద్ద సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్ పర్యటన నేపథ్యంలో నిరసనకు సిద్ధమైన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ముకరంపురంలోని ఆయన కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హల్ద్వానీలో పర్యటించిన ప్రాంతాన్ని శుద్ధి చేసి అంటరానితనాన్ని ప్రోత్సహించిన ఘటనపై కరీంనగర్‌కు వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను ప్రశ్నిస్తామని తెలిపారు. ఈ అంశంపై మాట్లాడేందుకు సిద్ధమైతే బీజేపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.కాంగ్రెస్ ఎస్సీ సెల్, మైనారిటీ సెల్ జిల్లా, నగర అధ్యక్షులు, నాయకులను పోలీసులపై ఒత్తిడి తెచ్చి అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్‌పై ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా పేర్కొనడం ఏమిటని, ఓటు హక్కుపై ప్రశ్నించిన వారంతా దేశద్రోహులా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వైఖరిని నరేందర్ రెడ్డి తప్పుబట్టారు. అరెస్టు చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.