telangana
ఇందిరమ్మ భీమా ప్రతి ఒక్కరు చేసుకోవాలి - జైనూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ రషీద్
సూర్య జైనూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని జైనూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ రషీద్, గౌరీ కొలాంగూడ గ్రామ సర్పంచ్ ఆత్రం అయ్యుబాయి భుజంగ్రావ్ అన్నారు.
సోమవారం జైనూర్ మండలంలోని గౌరీ కొలాంగూడ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షేక్ రషీద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా నిలిచేందుకు రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకం పేద కుటుంబాలకు ఎంతో ధీమానిస్తుందని, ఆపద సమయంలో ఆర్థికంగా ఆదుకుంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ, కరపత్రాలు పంపిణీ చేసి పథకం విశిష్టతను ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి పద్మారావు, ఉప సర్పంచ్ షేక్ ఫైసల్, వార్డు సభ్యులు లింబారావు, ముండే వర్ష, గంగారాం, అయ్యుబాయి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భుజంగ్రావు, షేక్ మహబూబ్, అయ్యుబ్, జ్యోతిరం తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.