కోరెం ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. 65 ఇంచుల స్మార్ట్ టీవీని ప్రారంభించిన చెన్నాడి సుధాకర్ రావు
సూర్య బోయినపల్లి ..మండలం కోరెం ప్రాథమిక పాఠశాల కోరెం విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధనలో భాగంగా చెన్నాడి మార్తాండ రావు ట్రస్ట్ వారిచే బహుకరించిన 65 ఇంచుల శాంసంగ్ స్మార్ట్ టీవీని (రూ.88,000 విలువ గల) చెన్నాడి సుధాకర్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సుధాకర్ రావు గారు మాట్లాడుతూ గ్రామ విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించడంలో తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. డిజిటల్ విద్య ద్వారా గ్రామీణ విద్యార్థులు కూడా పట్టణ విద్యార్థులతో సమానంగా రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్ , వార్డు మెంబర్లు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ , మండల విద్యాధికారి , బోయిన్‌పల్లి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ , కోరెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వాలంటీర్లు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి నిర్వాహకులు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.