telangana
పాడైన రోడ్డును పట్టించుకోని అధికారులు
సూర్య, కాగజ్నగర్ : కొమరం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి పక్కన ఎడమవైపు నుండి కరుణ రోడ్డు వైపు నుండి రైల్వే స్టేషన్ కు వెళ్లే రహదారిలో నాలాపై ఉన్న స్లాపు కూలిపోయి ప్రజలు, ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇప్పటివరకు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ప్రజలు వాపోతున్నారు, ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ఇప్పటికైనా యుద్ధ ప్రాతి పదికన ఈ రోడ్డుపై ప్రయాణికులు సాఫీగా ప్రయాణించే విధంగా రోడ్డును మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.