వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఎల్. నగరం వార్డ్ నెంబర్ 5 నామినేషన్ దాఖలు
వెల్దుర్తి మండల పరిధిలోని ఎల్. నగరం గ్రామం, వార్డ్ నెంబర్ 5 స్థానానికి అభ్యర్థిగా పింజారి జిలక బి గారు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వెల్దుర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి mpo కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మద్దతుదారులు పాల్గొన్నారు.