BREAKING
ఉపాధి అవకాశాలపై అవగాహన రాఘవపూర్ శివారులో గంజాయి పట్టివేత.. - నిందితుడిపై కేసు నమోదు అంసాన్ పల్లి గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ సైబర్ నేరాల నుంచి నిన్ను నీవు రక్షించుకోండి *అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రిపై అసత్య ఆరోపణలు* రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎస్వీయూలో ‘అన్వేషణ-2026’ ప్రారంభం -జ్ఞానానికి ఆవిష్కరణ జోడిస్తేనే భవిష్యత్ : రెక్టర్ ఆచార్య చెండ్రాయుడు కొల్చారంలో ఆల్ ఇండియా బంజారా మేళా ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి రేణిగుంటలో ఓటర్ స్లిప్పుల బీఎల్వోలు ఇవ్వలేదని ఓటర్ల ఆగ్రహం.. పైతర గ్రామంలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం జడ్పిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం.. 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. 10782 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లు పేట స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా నరసింహ చారి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం ఎస్సై బాలరాజు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల సునామీ: సెనేట్, హౌస్ రెండూ వారివే

ఓటరు నిర్భయంగా ఓటేయండి - పోలీసులు మీ వెంటే ఉన్నారు

Select Suryaa Now
ఓటరు నిర్భయంగా ఓటేయండి - పోలీసులు మీ వెంటే ఉన్నారు

పలాస, సూర్య : జెడ్పీటీసీ / ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలోని ఓటర్లకు కాశీబుగ్గ సబ్ డివిజన్ పోలీస్ అధికారి జివి రమణ పలు సూచనలు జారీ చేశారు.ప్రతి ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిందని డీఎస్పీ తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్ తీసుకురావద్దు :

ఓటు వేయడానికి వచ్చే వారు సెల్ ఫోన్ తో పోలింగ్ బూత్ లోకి ప్రవేశించరాదని డీఎస్పీ స్పష్టం చేశారు.ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించి ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు సహకరించాలని కాశీబుగ్గ సబ్ డివిజన్ పోలీస్ అధికారి జి.వి రమణ విజ్ఞప్తి చేశారు.