BREAKING
ఉన్నత లక్ష్యాలతోనే విద్యార్థుల భవిష్యత్తు.. జడ్జి గడ్డం మేఘన పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండి నిత్యవసర ధరలను నియంత్రించాలి-రేషన్ లో 14 రకాల సరుకులు ఇవ్వాలి.. వరుణ్ సందేశ్ యద్భావం తద్భవతి చిత్రం నుండి జిజెన్ చిక సాంగ్ విడుదల మున్నూరు కాపు  పటేల్స్ సంఘం ఎన్నికల రాష్ట్ర కోఆర్డినేటర్ గా కాస రాజు పటేల్ నియామకం కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

ఒక్క అవకాశం ఇవ్వండి.. నగర అభివృద్ధికి కృషి చేస్తాను

Select Suryaa Now
ఒక్క అవకాశం ఇవ్వండి..  నగర అభివృద్ధికి కృషి చేస్తాను

విజయనగరం, సూర్య : విజయనగరం, అక్టోబర్ 29: ఓటరు దేవుళ్ళు తమ ఓటుతో తనకు ఒక్క అవకాశం ఇస్తే  విజయనగరం కార్పొరేషన్ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని తెలుగు దేశం పార్టీ బలపరిచిన కూటమి మేయర్ అభ్యర్థిని అవనాపు భార్గవి విజయ్ ఓటర్లును అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అధితి గజపతితో కలిసి భార్గవి ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీరి ప్రచారానికి ప్రజలను నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రచారంలో ప్రతీ చోటా వీరి వెంట మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్యే అధితి గజపతి కోరుతున్నారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణం ద్వారా ఉత్తరాంధ్రకు, ముఖ్యంగా విజయనగరం అభివృద్ధికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాటలు వేశారని తెలిపారు. తాను ఎమ్మెల్యే ఐన ఈ రెండున్నర ఏళ్ళలో విజయనగరం పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి కొట్లాది నిధులు తెచ్చి రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మించి అభివృద్ధి చేసినట్టు తెలిపారు. చంద్రబాబు నాయుడు బీసీలకు, మహిళలకు పెద్ద పీఠ వేశారని, అందులో భాగంగానే, ఓసీ స్థానం ఐనప్పటికీ విజయనగరం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థినిగా బీసీ మహిళ అవనాపు భార్గవికి అవకాశం కల్పించారని తెలిపారు. నిత్యం ప్రజా సేవ చేసే కుటుంబంగా గుర్తింపు పొందిన అవునాపు ఇంటి నుంచి వచ్చిన బీసీ మహిళగా అవనాపు భార్గవిని ఆదరించాలని ఎమ్మెల్యే అధితి కోరారు. కూటమి మేయర్ అభ్యర్థినిగా భార్గవిని, కూటమి కార్పొరేట్ అభ్యర్థులను గెలిపించుకుని, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నెలకొల్పాలని, తద్వారా నగర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఓటర్లను ఎమ్మెల్యే అభ్యర్థించారు. కాగా గురువారం 34 వ డివిజన్ జొన్నగొడ్డి, బాలాజీ టెక్స్టైల్ మార్కెట్ ప్రాంతాల్లోనూ, అదేవిదంగా 22,  26, 9, 2వ డివిజన్ల లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు పివిజి కుమార్, కూటమి పార్టీలు బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థులు 34-దేవరాపల్లి రామలక్ష్మి, 22-గణపతి రాజు శ్రీకాంత్ , 26- కెల్ల భీష్మ, 9-సోము మాధవి, 2- గొంప స్వప్న పాల్గొన్నారు.