BREAKING
నిఖిల్ 'స్వయంభు' సినిమా విడుదలపై తీవ్ర అనిశ్చితి: పాన్ ఇండియా చిత్రాల వలసల వల్ల హీరోలకు తప్పని కష్టాలు అయ్యప్ప అన్నసమారాధనలో పాల్గొన్న స్వాతి ప్రమోటర్స్ ఎండి రమేష్ రెడ్డి నేరడిగొండ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘనంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ దినోత్సవం సిద్దిపేట డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి - టీఎంయూ రాష్ట్ర నాయకుల డిమాండ్ ఆళ్లగడ్డ మండలంలో కూటమి ప్రభంజనం ఐవీవై పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు కీర్తి సురేష్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నెట్‌ఫ్లిక్స్ 'అక్క' వెబ్ సిరీస్: మాతృస్వామ్య నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వచ్చునూరు గ్రామ మాజీ సర్పంచ్ పారమిత విద్యాసంస్థలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు వ్యూహం ఫలించింది...ఆశించిన ఎంపీపీ పీఠం దక్కింది! పాలమూరు ఎడారిగా మారడానికి కేసీఆరే కారణం సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ముగింపు సందర్భంగా ర్యాలీ నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు! కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే! కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ అచీవర్స్ పాఠశాలలో ఘనంగా కాలుష్య రహిత దీపావళి వేడుకలు వికసిత్ భారత్ @ 2047లో  యువ సంవాద్ .

నెల్లూరు, గూడూరులో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

Select Suryaa Now
నెల్లూరు, గూడూరులో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :  నెల్లూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని, రాత్రి 8 గంటల్లోగా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను అధికారులు కష్టపడి, సమన్వయంతో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని తెలిపారు.  శనివారం నెల్లూరులోని వీఆర్ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సందర్శించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. కౌంటింగ్ నిర్వహణ, సిబ్బంది విధులు, ఫలితాల నమోదు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల నిబంధనలను పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు.  తొలుత గూడూరులోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. అక్కడ ఓట్ల లెక్కింపు తీరును సమీక్షించి రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని ఆరు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోందని, అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
కలెక్టర్ పరిశీలనకు ముందుగా జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి గూడూరులోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.