telangana
ఐవీవై పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు
సూర్య కరీంనగర్ : నగరంలోని సీతా రాంపూర్ ఐవీవై పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దీపాలతో అలంకరించిన ఆకృతులతో అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు గుండె ఆకారంలో దీపాలను అమర్చి, కింద రంగురంగుల ప్రమిదలతో దీవాలి అని రాసి తమ సృజనాత్మకతను చాటారు. చుట్టూ కూర్చొని దీపాల వెలుగులో ఆనందంగా పాల్గొన్న చిన్నారుల ఉత్సాహం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మెన్ పసుల మహేష్ మాట్లాడుతూ దీపావళి అంటే చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అని, విద్యార్థులలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకే ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యావరణ హితమైన దీపావళిని జరుపుకోవాలని, టపాసులకు దూరంగా ఉండి మట్టి ప్రమిదలతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.