ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి
సూర్య- బిక్కనూర్ : లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలని, మండలంలోని జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్ చెప్పారు. శనివారం గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు లబ్ధిదారులతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రకాష్ గౌడ్ కార్యదర్శి దయాకర్ రెడ్డి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బలుసుకునల సత్యం ఎండోమెంట్ డైరెక్టర్ అక్కు కార్తీక్, కొండం రవి,సార్గు నరేష్,నీల స్వామి,రామస్వామి వార్డు మెంబర్ గోన్లె భాను చందర్ లింగం నర్సింలు బాలయ్య పాల్గొన్నారు