BREAKING
జెడ్పీటీసీ గా ' వలిరెడ్డి' గెలుపు ....4 ఎంపీటీసీలు వైసీపీ, 12 ఎంపీటీసీలు టీడీపీ, జనసేన రెండు .... నెల్లూరు రూరల్ మండలంలో అన్ని ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ప్రభంజనం రాపూరు బిట్-1లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఏటూరు మురళీమోహన్ రెడ్డి ఘన విజయం న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వినియోగించుకోండి మండల న్యాయ సేవాధికారిక సంస్థ చైర్మన్. ప్రజల జీవితాల్లో దీపావళి కొత్త వెలుగులు నింపాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ పర్యావరణ పరిరక్షణ - సహజ వనరుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత బ్రాహ్మణపల్లిలో ఇక టీడీపీ జెండానే..! మంత్రి ఆనంకు తొలి బహుమతి కావలిలో ఒక రోజు ముందుగానే దీపావళి సందడి..! మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారు.. మాకెందుకు నిధులు రావు:మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తాం! పాచిపెంట మండలం ఎంపీపీ పదవి గూడెపు యుగంధర్ కైవసం అద్దంకి ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం. 14 ఎంపీటీసీ స్థానాలకు గాను 12 కైవసం. జెడ్పీటీసీ గా ' వలిరెడ్డి' గెలుపు ప్రజా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధే మా సర్కార్ ధ్యేయం : రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి బాడంగిలో టీడీపీ విజయభేరి!

భారీ మెజారిటీతో శివడవలస టిడిపి ఎంపీటీసీ గెలుపు:

Select Suryaa Now
భారీ మెజారిటీతో శివడవలస టిడిపి ఎంపీటీసీ గెలుపు:

బొబ్బిలి, సూర్య : మండలం లోని శివడవలస ఎంపిటిసి స్థానాన్ని టీడీపీ అభ్యర్థి చప్ప సత్యరావు భారీ మెజారిటీతో విజయం సాధించారు. బొబ్బిలి మండలం శివడవలస గ్రామ ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే బేబీ నాయన, శ్రీ చప్ప రామస్వామి నాయుడు టీడీపీ తరపున బరిలోకి దిగిన ఎంపీటీసీ అభ్యర్థి చప్ప సత్యరావు తన ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి విజయఢంకా మోగించారు. తాను సాధించిన ఈ అఖండ విజయం అనంతరం చప్ప సత్యరావు శివడవలస గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల్లో తనను నమ్మి,భారీ మెజారిటీతో గెలిపించినందుకు గ్రామంలోని ప్రతి వీధిని సందర్శిస్తూ ఓటర్లకు, ప్రజలకు పేరుపేరున నమస్కరిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం చప్ప సత్యరావు నివాసం వద్ద విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు,మరియు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.  చప్ప సత్యరావు ఘన విజయం సాధించడంతో నాయకులు,కార్యకర్తలు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో శoబoగి శ్రీను ,మాజీ ఎంపీటీసీ శoబoగి సీతం నాయుడు, మాజీ 10వ ,మెంబర్ బొద్దాన శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.