BREAKING
బెర్క్‌షైర్ హాత్వే త్రైమాసిక లాభాల్లో క్షీణత...భారీగా పెరిగిన షేర్ల బైబ్యాక్ కొనుగోళ్లు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల రేసులో మెలంచన్ సంచలన హామీలు ఆమదాలవలస మండలం కూటమి కైవసం * ఒకే ఒక్క స్థానంలో వైసిపి గెలుపు * గాజాలో భారీ వర్షాలు, వరదలతో వణికిపోతున్న శరణార్థులు అప్పుల బాధలు తట్టుకోలేక రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య.. చిట్యాల మండలం శివనేనిగూడెంలో విషాదం భారీ మెజారిటీతో శివడవలస టిడిపి ఎంపీటీసీ గెలుపు: వెలమ కార్పొరేషన్ చైర్మన్‌ కు శుభాకాంక్షలు తెలిపిన శ్రీహరి రావు : గుడిపల్లిలో టీడీపీ విజయకేతనం కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగూరు నారాయణ హెచ్‌ఐవి /ఎయిడ్స్ సమీక్ష సమావేశం ఫార్మా డి, లా పరీక్ష ఫలితాలు విడుదల కూటమి తరపున తల్లి, కూతుర్లు విజయం ఎయిమ్స్‌(ఇనిసెట్‌) పీజీ ప్రవేశ పరీక్షల్లో శ్రీప్రజ్ఞ ప్రతిభ ఓయన్ కొత్తూరులో టీడీపీ విజయకేతనం

పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి రామకృష్ణ

Select Suryaa Now
పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి రామకృష్ణ
సూర్య, పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ మండలంలోని గుంట్లపేట్, బొంబాయిగూడ గ్రామాల్లో శనివారం మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు సాగు చేస్తున్న మిర్చి, కంది పంటలను పరిశీలించారు. పంటల ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తూ చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు.కంది పంట ప్రస్తుతం పూత దశలో ఉన్నందున పుష్పాలు, కాయలను ఆశించే పురుగుల నివారణకు వ్యవసాయ శాఖ సిఫారసు చేసిన మందులను నిర్ణీత మోతాదులో పిచికారీ చేయాలని సూచించారు. పూత, కాయ దశలో వచ్చే తెగుళ్లు, పురుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.అదేవిధంగా మిర్చి పంటలో చీడపీడల నివారణకు తగిన మందులను సూచించిన మోతాదులోనే వినియోగించాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంటల సంరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. పంటల సాగులో ఏవైనా సమస్యలు, సందేహాలు ఎదురైతే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని వ్యవసాయ అధికారి రామకృష్ణ కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.