BREAKING
బెర్క్‌షైర్ హాత్వే త్రైమాసిక లాభాల్లో క్షీణత...భారీగా పెరిగిన షేర్ల బైబ్యాక్ కొనుగోళ్లు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల రేసులో మెలంచన్ సంచలన హామీలు ఆమదాలవలస మండలం కూటమి కైవసం * ఒకే ఒక్క స్థానంలో వైసిపి గెలుపు * గాజాలో భారీ వర్షాలు, వరదలతో వణికిపోతున్న శరణార్థులు అప్పుల బాధలు తట్టుకోలేక రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య.. చిట్యాల మండలం శివనేనిగూడెంలో విషాదం భారీ మెజారిటీతో శివడవలస టిడిపి ఎంపీటీసీ గెలుపు: వెలమ కార్పొరేషన్ చైర్మన్‌ కు శుభాకాంక్షలు తెలిపిన శ్రీహరి రావు : గుడిపల్లిలో టీడీపీ విజయకేతనం కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగూరు నారాయణ హెచ్‌ఐవి /ఎయిడ్స్ సమీక్ష సమావేశం ఫార్మా డి, లా పరీక్ష ఫలితాలు విడుదల కూటమి తరపున తల్లి, కూతుర్లు విజయం ఎయిమ్స్‌(ఇనిసెట్‌) పీజీ ప్రవేశ పరీక్షల్లో శ్రీప్రజ్ఞ ప్రతిభ ఓయన్ కొత్తూరులో టీడీపీ విజయకేతనం

జలసిరి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీడీఓ..

Select Suryaa Now
జలసిరి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీడీఓ..
సూర్యరాజంపేట :  గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను అభివృద్ధి చేయడంతో పాటు, రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వం చేపడుతున్న జలసిరి కార్యక్రమం పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా రాజంపేట మండలంలోని ఏడు ఆరు కొండ గ్రామంతో పాటు ఎల్లారెడ్డిపల్లి తండాలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎంపీడీఓ బి. సూర్యాజీ పరిశీలించారు.మొదట ఏడు ఆరు కొండ గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ గ్రామంలో జలసిరి కార్యక్రమం కింద నిర్మిస్తున్న ఫామ్ పాండ్ల పనుల పురోగతిని పరిశీలించారు. పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, వాటి నిర్మాణ నాణ్యత ఎలా ఉందనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.అనంతరం ఎల్లారెడ్డిపల్లి తండాలో పర్యటించిన ఎంపీడీఓ జలసిరి కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న ఫామ్ పాండ్లను పరిశీలించారు. అలాగే గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసి, రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు వాటిని సక్రమంగా నమోదు చేయాలని కార్యదర్శికి సూచించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ బి. సూర్యాజీ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులను చేపట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏడు ఆరు కొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌరీ, ఫీల్డ్ అసిస్టెంట్ గోపి, ఎల్లారెడ్డిపల్లి తండా గౌరవ సర్పంచ్ లలిత బన్సీలాల్, ఉపసర్పంచ్ పీరియా, పంచాయతీ కార్యదర్శి శ్రీకన్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.