నందవరం జడ్పిటిసిగా అక్క మహాదేవి విజయం
ఎమ్మిగనూరు,సూర్యప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లా నందవరం మండలం జడ్పీటీసీ మెంబర్ గా అక్కమహాదేవి 4,469 ఓట్ల మెజారిటీతో తమ సమీప ప్రత్యర్థి బోయ బజారమ్మ పై గెలుపొందారు. అక్కడ జడ్పిటిసి సీట్లు టిడిపి కైవసం చేసుకుంది. అక్కమహాదేవి తన స్వగ్రామైన పూల చింత మొన్నటివరకు సర్పంచ్ గా సేవలందించారు. ఆమె భర్త బండెప్ప స్వామి టిడిపి సీనియర్ నాయకుడుగా కొనసాగుతూ ప్రజాసేవలో ఉన్నారు.
A. R. శరత్ కుమార్
సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా