పారిశుద్ది కార్మిలకులకు చీరల పంపిణి
పాలమూరు మేజర్ న్యూస్ :-
మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఈ రోజు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ ముదిరాజ్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా మేయర్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి ,ఇతర మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎం.ఓం ప్రకాష్,మహబూబ్ నగర్ .