BREAKING
రష్యాలో జపాన్ టొబాకో ఆస్తులను స్వాధీనం చేసుకున్న పుతిన్ బెర్క్‌షైర్ హాత్వే త్రైమాసిక లాభాల్లో క్షీణత...భారీగా పెరిగిన షేర్ల బైబ్యాక్ కొనుగోళ్లు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల రేసులో మెలంచన్ సంచలన హామీలు ఆమదాలవలస మండలం కూటమి కైవసం * ఒకే ఒక్క స్థానంలో వైసిపి గెలుపు * గాజాలో భారీ వర్షాలు, వరదలతో వణికిపోతున్న శరణార్థులు అప్పుల బాధలు తట్టుకోలేక రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య.. చిట్యాల మండలం శివనేనిగూడెంలో విషాదం భారీ మెజారిటీతో శివడవలస టిడిపి ఎంపీటీసీ గెలుపు: వెలమ కార్పొరేషన్ చైర్మన్‌ కు శుభాకాంక్షలు తెలిపిన శ్రీహరి రావు : గుడిపల్లిలో టీడీపీ విజయకేతనం కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగూరు నారాయణ హెచ్‌ఐవి /ఎయిడ్స్ సమీక్ష సమావేశం ఫార్మా డి, లా పరీక్ష ఫలితాలు విడుదల కూటమి తరపున తల్లి, కూతుర్లు విజయం ఎయిమ్స్‌(ఇనిసెట్‌) పీజీ ప్రవేశ పరీక్షల్లో శ్రీప్రజ్ఞ ప్రతిభ

వీడియో ప్రత్యక్ష ప్రసారం ద్వారా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షణ..

Select Suryaa Now
వీడియో ప్రత్యక్ష ప్రసారం ద్వారా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షణ..

విజయనగరం, సూర్య : జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్ వీడియో ప్రత్యక్ష ప్రసారం (వెబ్‌కాస్టింగ్) ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలిస్తూ, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి రౌండ్‌లో ఓట్ల లెక్కింపును అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని, లెక్కించిన ఓట్ల వివరాలను సంబంధిత రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి దశలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని ఆదేశించారు.
కౌంటింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు నిబంధనల ప్రకారం అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా సందేహాలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించి, ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్ ఆదేశించారు.  కంట్రోల్ రూమ్ లో  డిఆర్ఓ  సిహెచ్ సత్తిబాబు, జడ్పీ సీఈవో కిరణ్ కుమార్, జెడ్ పి  డిప్యూటీ సీఈవో లవ రాజు, ఇతర ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.